రూ.471 కోట్ల ఖరీదైన పెయింటింగ్ చెత్తలో..

ప్రపంచంలో ఖరీదైన వస్తువులు ఏవైనా ఉన్నాయంటే అవి ప్రముఖ చిత్రకారులు వేసిన పెయింటింగ్‌లు మాత్రమే. వ్యక్తి పట్ల ఇష్టమో.. పెయింటింగ్ పట్ల మక్కువో తెలియదు కాని కోట్లు ఖర్చుపెట్టి కొనుగోలు చేస్తుంటారు. పురాతన వస్తువులు, పాత పెయింటింగులు ఎంత ఖరీదైనా కొనేస్తుంటారు. ఇలాంటి వాటికి వేలంపాట నిర్వహించి మరీ అమ్ముతుంటారు నిర్వాహకులు.
ఇటలీకి చెందిన గుస్తవ్ క్లిమ్ట్ 1917లో ఓ ఆర్ట్ వర్క్‌ను చేశారు. అయితే అది వేసిన ఏడాదికే ఆయన మరణించారు. 1925లో ఈ ఆర్ట్ వర్క్‌ను రిచ్చీ ఆడి గ్యాలరీలో భద్రపరిచారు. దీని ఖరీదు అప్పట్లోనే 51 మిలియన్ పౌండ్లు. అంత ఖరీదైన ఆర్ట్ గ్యాలరీ నుంచి 1997 ఫిబ్రవరిలో మాయమైంది. గ్యాలరీ నిర్వాహకులు ఎంత వెదికినా కనిపించలేదు. ఆ విషయం కాస్తా కాలక్రమంలో మరుగున పడింది.
అయితే అనూహ్యంగా అదే ఆర్ట్ గ్యాలరీ బయటి ఆవరణాన్ని శుభ్రం చేస్తున్న క్లీనర్‌కు ఈ ఆర్ట్ పీస్ దొరికింది. గ్యాలరీ బయటి గోడల మధ్య ఒక చిన్న తలుపు కనిపించింది. తీసి చూస్తే ఓ ప్లాస్టిక్ బ్యాగ్ ఉన్నట్లు క్లీనర్ తెలిపారు. అందులో వందల కోట్ల విలువ చేసే పెయింటింగ్ చూసి ఆశ్చర్యానికి లోనయ్యానని అంటున్నాడు. మరి అది అక్కడికి ఎలా వెళ్లింది అనేది మిస్టరీగా ఉంది. గ్యాలరీ నిర్వాహకులకు కూడా అంతుపట్టని రహస్యంగా అనిపిస్తోంది. ఇన్నేళ్ల తరువాత కూడా చెక్కుచెదరని ఆ పెయింటింగ్ కళాకారుని ప్రతిభకు అద్దం పడుతుందని నిర్వాహకులు తెలిపారు.
RELATED STORIES
Hong Kong: కొడుకు చేతిలో బొమ్మ విరిగింది.. దుకాణదారుడికి రూ.3 లక్షలు...
25 May 2022 11:15 AM GMTAmerica: అమెరికాలో మారణహోమం.. 18 మంది పిల్లలు, ముగ్గురు టీచర్లు...
25 May 2022 9:45 AM GMTNarendra Modi: క్వాడ్ దేశాల సదస్సులో మోదీ.. పలువురు దేశాధినేతలతో...
24 May 2022 9:45 AM GMTChina Corona: చైనా రాజధానిలో మళ్లీ లౌక్‌డౌన్.. ఇప్పటికే పలు జిలాల్లో...
23 May 2022 4:15 PM GMTUkraine: మరియుపూల్ తర్వాత లుహాన్స్క్ ప్రాంతంపై రష్యా దృష్టి..
23 May 2022 3:45 PM GMTKTR: లండన్‌లో కేటీఆర్ పర్యటన.. తెలంగాణకు మరో భారీ పెట్టుబడి..
18 May 2022 4:15 PM GMT