తినడానికి లేకపోయినా ఉప్మాపెట్టి.. టీ ఇచ్చి..: రేణూ ఎమోషనల్ ట్వీట్

మన దగ్గర చాలినంత కంటే ఎక్కువ డబ్బులు ఉన్నా దానం చేయాలంటే మనసు రాదు. కానీ ఆ అమాయకపు పల్లె ప్రజలకు ఆ పూట గడవడమే కష్టం. అయినా వాళ్లు నాకు ప్రేమతో ఉప్మా పెట్టారు.. టీ చేసి ఇచ్చారు అని నటి రేణూ దేశాయ్ తనను ఆదరించిన పల్లె వాసులకు కృతజ్ఞతలు తెలిపారు సోషల్ మీడియా వేదికగా. ఓ సినిమా షూటింగ్ ముగించుకుని తిరిగి హైదరాబాద్ వస్తుంటే మధ్యలో డిజైనర్‌తో తనకు అప్పుడే నగరానికి వెళ్లాలని లేదని రేణూ అన్నారట. అంతలోనే కారుకూడా పంక్చర్ అయింది. దాంతో ఆ రోజు గ్రామంలోనే ఉండిపోవలసిన పరిస్థితి. పల్లె వాసులకు తానెవరో తెలిసి ఎంతో బాగా ఆదరించారని రేణూ అన్నారు. పట్టణాల్లో ఉండే పొల్యూషన్, ట్రాఫిక్ జామ్‌లు పల్లెలలో ఉండవని.. పచ్చని పంట చేలలో తిరుగుతుంటే ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉంటుందని తెలిపారు. వాళ్లనుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంటుందని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com