ఆస్ట్రేలియాలో అలా చేస్తే అయిదు లక్షలు ఫైన్..

ఆస్ట్రేలియాలో అలా చేస్తే అయిదు లక్షలు ఫైన్..

australia

ఆస్ట్రేలియా అడవులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. కోట్లల్లో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. ఈ కార్చిచ్చు ఆగేదెన్నడు అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల వానదేవుడు కరుణించడంతో పరిస్థితి కొంత మామూలు స్థితికి వచ్చింది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం మంటలను అదుపు చేసేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా వాహనదారులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పాదచారులైనా, కార్లలో ప్రయాణించే వారైనా సిగరెట్ తాగి రోడ్డు మీద పడేస్తే భారీ జరిమానా విధిస్తామంటోంది. టోటల్ ఫైర్ బ్యాన్ అమలులో ఉన్న కారణంగా బహిరంగ ప్రాంతాల్లో ఏ ఒక్కరూ నిప్పుకు సంబంధించిన పనులు చేయరాదు. జనవరి 17 నుంచి ఇది అమలులోకి వచ్చినట్లు తెలిపారు.

Read MoreRead Less
Next Story