మరో సంచలన నిర్ణయానికి సిద్ధమైన వైసీపీ ప్రభుత్వం

మరో సంచలన నిర్ణయానికి సిద్ధమైన వైసీపీ ప్రభుత్వం

రాజధాని అమరావతి తరలింపుపై పట్టుదలతో ఉన్న వైసీపీ ప్రభుత్వం.. మరో సంచలన నిర్ణయానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. శాసనమండలి రద్దు దిశగా వైసీపీ యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు వ్యవహారాల్లో శాసనమండలిలో ఇబ్బందులు తలెత్తితే సీరియస్‌గా తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా శాసనమండలిని రద్దు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన సైతం చేస్తున్నట్లు తెలుస్తోంది. మండలి రద్దుపై అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌కి పంపాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీనిపై న్యాయనిపుణులతో సైతం ప్రభుత్వం ఇప్పటికే చర్చించినట్టు వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Tags

Next Story