మంచి మనసును చాటుకున్న టాలీవుడ్ భామ

X
టాలీవుడ్ అందాల తార పూజా హెగ్డే మంచి మనసును చాటుకున్నారు. క్యాన్సర్ బాధితుల కోసం తన వంతు సాయంగా 2.5 లక్షల రూపాయల విరాళం అందించారు. హైదరాబాద్‌లో గోల్ఫ్ క్లబ్లో ‘క్యూర్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫౌండేషన్ అందించిన ఆర్థిక సహకారంతో క్యాన్సర్‌ను జయించిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను వైద్యుల కుటుంబం నుంచి వచ్చానని, తన అన్న వైద్యుడు అని తెలిపారు పూజా. అలాగే ఫ్రెండ్స్ కూడా వైద్యరంగంలో ఉన్నారని అన్నారు. వైద్యుడే నిజమైన హీరో అని భావిస్తానని పూజా తెలిపారు.
వీడియో కోసం క్లిక్ చేయండి==>>మంచి మనసును చాటుకున్న టాలీవుడ్ భామ
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
