రాజధాని మార్పు వెనుక.. విశాఖలో భూదందాలు చేయాలనే కుట్ర కనిపిస్తుంది: బీజేపీ

రాజధాని మార్పు వెనుక.. విశాఖలో భూదందాలు చేయాలనే కుట్ర కనిపిస్తుంది: బీజేపీ

Untitled-2

ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని తుగ్లక్ చర్యగా బీజేపీ నేతలు అభివర్ణించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఢిల్లీలో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం ఆలోచన వెనుక.. విశాఖపట్నంలో భూదందాలు చేయాలన్న కుట్ర కనిపిస్తోందని కన్నా అన్నారు. తాము తీసుకునే నిర్ణయాలను కేంద్రానికి ఆపాదించడాన్ని ఆయన ఖండించారు.

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని లెక్కలు చెప్తున్న సీఎం జగన్, మంత్రులు.. ఎందుకు కేసులు పెట్టలేదని జీవీఎల్ ప్రశ్నించారు. రేపటిలోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారాయన. వైసీపీ సర్కార్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై జనసేనతో కలిసి పోరాట కార్యాచరణ సిద్ధం చేస్తామని బీజేపీ నేతలు స్పష్టంచేశారు.

Tags

Next Story