మెంతులను రోజూ తీసుకుంటే..

మెంతులను రోజూ తీసుకుంటే..

fenugreek

రోజూ వంట గదిలో ఏదో ఒక కూరో, చారో పోపు పెడుతుంటాము. వాటికి జీలకర్ర మెంతులు వాడుతుంటాము. అయితే ఆవాలు, జీలకర్ర వేస్తాము కానీ మెంతులను గుర్తుంటే వేస్తాము లేదంటే వేయము. కానీ పోపులో వేయడమో లేదా మరో రూపంలోనో రోజూ తీసుకుంటే చాలా మంచిది. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు దూరం అవుతాయి. పొడి రూపంలో కానీ, మెంతులు నాన బెట్టిన నీటిని కానీ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

మెంతుల్లో పోషకాలు, పీచు పదార్ధాలు, ఇనుము, విటమిన్ సి, బి1, బి2, క్యాల్షియంలు సమృద్ధిగా ఉంటాయి. బాలింతలు మెంతులను తీసుకుంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది. మెంతుల కషాయం తాగినా, మెంతికూర వాడినా ప్రయోజనం ఉంటుంది. జుట్టు ఊడిపోతోందని బాధపడేవారు రోజూ కడుపులోకి తీసుకుంటూ పైన కూడా అప్లై చేయాలి. మెంతులను నానబెట్టిన నీటిని జుట్టుకి పట్టించి ఓ అరగంట పాటు ఉంచేయాలి. మరొకటి మెంతులను రాత్రి పూట పెరుగులో నానబెట్టి ఉదయాన్నే మిక్సీ పట్టాలి. దాన్ని తలకు పట్టిస్తే జుట్టు పెరగడంతో పాటు చుండ్రు కూడా తగ్గుతుంది. ఇంకా జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.

షుగర్‌తో బాధపడేవారు మెంతుల నీటిని రెగ్యులర్‌గా తాగడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. ఉత్తర భారత దేశంలో బాలింతలకు సమృద్ధిగా పాలు పడాలని వారికోసం ప్రత్యేకంగా మెంతి హల్వా చేస్తారు. ఓ కప్పు మెంతి పొడి, ఓ కప్పు గోధుమ పిండి కలిపి ఓ స్పూన్ నేతిలో వేయిస్తారు. దానికి తగినంత పంచదార తీసుకుని హల్వా చేస్తారు. కొలెస్ట్రాల్‌ని అదుపులో ఉంచే శక్తి మెంతులకు ఉంది. వీరు రోజుకి 10 నుంచి 20 గ్రాముల మెంతి పొడిని నీళ్లు లేదా మజ్జిగతో కలిసి తీసుకుంటే ప్రమాదకరమైన ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గినట్లు అధ్యయనాల్లో తేలింది.

మలబద్దకాన్ని తగ్గించే గుణం మెంతులకు ఉంది. మెంతులు నీళ్ల విరేచనాలను, పేగుల్లోని లోపలి వాపుని తగ్గిస్తుంది. మెంతుల్లోని చేదు తత్వం కాలేయాన్ని శక్తివంతం చేస్తుంది. మెంతి ఆకులను పేస్ట్ చేసి దాన్ని మొటిమలు ఉన్న ప్రాంతంలో అప్లై చేసి ఓ గంట ఉంచుకోవాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తుంటే మొటిమల నుంచి విముక్తి పొందవచ్చు. గ్లాస్ నీటిలో ఓ స్సూన్ మెంతులు వేసి ఉదయాన్నే తాగడం అలవాటు చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి.

Read MoreRead Less
Next Story