ఏం ఆచారమో.. అన్నదమ్ములందరికీ కలిపి ఒక్కరే భార్యట..

భారతంలో చదువుకున్నాం. అన్నదమ్ములైన పాండవులు అయిదుగురు కలిసి ద్రౌపదిని పెళ్లి చేసుకుంటారని. అదే సీన్ ఇక్కడ కూడా. భారతదేశంలోని కొన్ని మారుమూల గ్రామాల్లో ఇంకా కొన్ని అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. మనిషి జీవితంలో పవిత్రంగా భావించే మాంగల్యబంధం ఒక్కరితోనే ముడిపడి ఉంటుంది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలు వివాహబంధాన్ని గౌరవిస్తాయి. కానీ రాను రాను వివాహబంధానికి తూట్లు పొడుస్తున్నారు. సంసారంలో సర్ధుకుపోవడం అనే మాట కొరవడింది.
ఒకరితోనే కష్టమనుకుంటే ఇంట్లో ఎంతమంది అన్నదమ్ములుంటే అంతమందినీ వివాహం చేసుకోవాలి.. సంసారం చేయాలి. ఈ వింత సాంప్రదాయం మరెక్కడో కాదు హిమాచల్ ప్రదేశ్‌లోని శివారు ప్రాంతాల్లో నివసించే కుటుంబాల్లో కొనసాగుతోంది. కుటుంబ నిబంధనల ప్రకారం అన్నదమ్ములంతా ఒకే యువతిని పెళ్లి చేసుకుని పంచుకుంటారు. ఎందుకు అలా చేస్తారని విచారిస్తే.. ఆ ప్రాంతాల్లో నివసించే వారంతా వ్యవసాయ భూములపై ఆధారపడి జీవిస్తారు.
ఆ కుటుంబంలో ఇద్దరు లేదా అంత కంటే ఎక్కువ మంది సోదరులను వేర్వేరుగా పెళ్లిళ్లు చేసుకుంటే కుటుంబ పోషణ కష్టంగా మారుతుంది. అంతే కాదు ఉన్న కొద్ది పాటి వ్యవసాయ భూమిని అన్నదమ్ములందరూ సమానంగా పంచుకోవాల్సి వస్తుంది. ఆ సమస్యను అధిగమించేందుకు ఆ గ్రామాల్లో అన్నదమ్ములంతా ఒకే యువతిని పెళ్లి చేసుకుని సంసారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. తరతరాలుగా ఈ పద్దతి కొనసాగుతోంది. ఇది ఎప్పటికీ ఆగదని స్థానికులు చెబుతున్నారు. మరి సమస్యలు ఏవీ వుండవా అని అంటే అవన్నీ మామూలే. సర్ధుకుపోతేనే సంసారం అంటారు ఇంటి పెద్దలు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com