పోలీస్ దొంగాయే.. కెమెరా కంటికి చిక్కిపాయే.. వీడియో

పోలీస్ దొంగాయే.. కెమెరా కంటికి చిక్కిపాయే.. వీడియో

police-constable

ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగేయరూ. అందులో పోలీస్ ఏముంది.. దొంగేముంది.. అవసరం అన్నింటినీ చేయిస్తుంది. మన హోదా ఏంటి.. మనం చేస్తున్న పనేంటి అన్న విషయం ఆ క్షణంలో అస్సలు గుర్తుకు రాదు. బుద్ది గడ్డితిని పోలీస్ దొంగగా మారాడు. ఎవరూ చూడట్లేదనుకుని ఎంచక్కా పాలపాకెట్లను దొంగిలించి పోలీస్ జీపులో వేసుకున్నాడు. ఈ సంఘటన జరిగింది మరెక్కడో కాదు.. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడాలో జరిగింది.

రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్‌కి అప్పుడే వచ్చిన ఓ పాల వ్యాన్ అక్కడ ఉన్న ట్రేలలలో ప్యాకెట్లను ఉంచి వెళ్లింది. పోలీస్ కంట పాలప్యాకెట్లు పడ్డాయి. అంతే వెంటనే తానో కానిస్టేబుల్ ఎవరైనా చోరీ చేస్తుంటే పట్టుకుని చితకబాదాలన్న విషయం మరిచిపోయాడు. అతడే దొంగ అవతారం ఎత్తి పాల ప్యాకెట్లు చోరీ చేశాడు.

ట్రేలో ఉన్న పాల ప్యాకెట్లను తీసుకుని వ్యాన్‌లో ఉన్న మరో కానిస్లేబుల్‌కి ఇచ్చాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీస్ ఉన్నతాధికారులు సదరు కానిస్టేబు‌ల్‌ని కొన్ని రోజులు సస్పెండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story