ఆంధ్రప్రదేశ్

జనసేన తరుపున మూడు రాజధానులకు మద్దతిస్తున్న: రాపాక వరప్రసాద్

జనసేన తరుపున మూడు రాజధానులకు మద్దతిస్తున్న: రాపాక వరప్రసాద్
X

RAPAKA

ఆంద్రప్రదేశ్‌కు అమరావతే రాజధానిగా ఉండాలని జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ డిమాండ్‌ చేస్తుంటే.. ఊరూవాడా తిరుగుతూ ప్రజల మద్దతు కూడగడుతుంటే.. జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ మాత్రం భిన్నంగా స్పందించారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్టు చెప్పారాయన. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానుల కాన్సెప్ట్ ఉపయోగపడుతుందని రాపాక వరప్రసాద్ అన్నారు.

మూడు రాజధానులకు అసెంబ్లీలో జై కొట్టారు జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిని జనసేన తరఫున అభినందిస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. ఓవైపు.. అమరావతి గ్రామాల్లో పర్యటనకు పవన్ కళ్యాణ్‌ రెడీ అవుతున్న సమయంలో.. రాపాక వ్యాఖ్యలు హాట్ టాపిక్‌ అయ్యాయి. పార్టీ స్టాండ్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన రాపాకపై జనసేనాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Next Story

RELATED STORIES