- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా...
టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్

ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేశారు. వాస్తవానికి మంగళవారం మండలి సమావేశానికి ఆయన గైర్హాజరు కావడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఐతే.. ఆయన తన రాజీనామా లేఖలో మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పడం TDPకి ఊరట కలిగించే అంశంగా చెప్పొచ్చు. నవ్యాంధ్రకు అమరావతి రాజధానిగా ఉండాలంని కోరుతూ సభలోనూ.. బయటా తాను ప్రయత్నం చేశానని లేఖలో పేర్కొన్నారాయన. 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలంటూ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు లేఖ రాశారు.
అటు.. టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్సీ శమంతకమణి, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కూడా సమావేశానికి గైర్హాజరయ్యారు. ఐతే.. అనారోగ్యం కారణంగానే మండలి సమావేశానకి రాలేదని శమంతకమణి తెలిపారు. విశాఖ ప్రాంతం నుంచి ఎన్నికైన మాధవ్.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సభకు గైర్హాజరయ్యారు. ఇక కాంగ్రెస్ MLC రత్నాబాయి కూడా సభకు రాకపోవడం చర్చనీయాంశమైంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com