ఉబెర్ ఈట్స్‌ని చేజిక్కించుకున్న జొమాటో

ఉబెర్ ఈట్స్‌ని చేజిక్కించుకున్న జొమాటో

ఫుడ్ డెలివరీలో సంచలనం సృష్టిస్తున్న జొమాటో మరో అడుగు ముందుకు వేసింది. దీపిందర్ గోయల్ నేతృత్వంలోని ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ చేసే ఉబర్ ఈట్స్ ని జొమాటో చేజిక్కించుకుంది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లో ఉబెర్ ఈట్స్ 9.99 శాతం వాటను కలిగి ఉంది. ఆల్-స్టాక్ ఒప్పందంలో భారతదేశంలోని ఉబెర్ ఈట్స్ ఫుడ్ డెలివరీ బిజినెస్‌ను కొనుగోలు చేసినట్లు జొమాటో మంగళవారం ప్రకటించింది. ఇది 350 మిలియన్ డాలర్లు ( దాదాపు రూ. 2,500 కోట్లు) వరకు ఉండొచ్చని నిఫుణుల అంచనా. భారతదేశంలో ఉబెర్ ఈట్స్ ప్రత్యక్ష రెస్టారెంట్లు, డెలివరీ భాగస్వాములు, ఉబెర్ ఈట్స్ యాప్ వినియోగదారులు వంటి కార్యకలాపాల నుండి తప్పుకోనున్నది. జొమాటో ప్లాట్‌ఫామ్‌ మంగళవారం నుండి ఆ కార్యకలాపాలు అమలు చేస్తుంది.

Tags

Next Story