ప్రభుత్వం మా బతుకులను నాశనం చేస్తోంది : అమరావతి రైతులు

ప్రభుత్వం మా బతుకులను నాశనం చేస్తోంది : అమరావతి రైతులు

మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా తమ ఆందోళనలను ఉధృతం చేసింది అమరావతి పరిరక్షణ సమితి. గుంటూరు, కృష్ణా జిల్లాల బంద్‌కు పిలుపు నిచ్చింది. ఆర్టీసీ బస్సులు మినహాయించి వ్యాపార, విద్యాసంస్థలు,‌ సినిమా హాళ్ళు, ప్రభుత్వ కార్యాలయాల స్వచ్ఛందంగా మూసివేయాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది. బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చింది. రాజధాని విభజనను నిరసిస్తూ రైతులు, ప్రజలు చేస్తున్న అందోళనలకు చేస్తున్నా ప్రభుత్వం బిల్లును ఆమోదించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్‌లు, కేసులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.

అటు అమరావతి గ్రామాల్లో రైతుల ఆందోళనులు 36వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి సహా పలు చోట్లలో నిరసనలు, మహాధర్నాలు, దీక్షలు కొనసాగుతున్నాయి. రాజధాని కోసం వేల ఎకరాల భూములు దారాదత్తం చేస్తే.. ఇప్పుడు ప్రభుత్వం తమ బతుకులను నాశనం చేస్తోందని మండిపడ్డారు. శాంతి యుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story