మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు.. నేషనల్ మీడియా సర్వేలో ఏపీ ప్రజల మనోగతం

మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు.. నేషనల్ మీడియా సర్వేలో ఏపీ ప్రజల మనోగతం

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు అవసరం లేదు. ఒక రాష్ట్రం ఒకే రాజధాని ముద్దు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయం అనాలోచితం ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావమిది. ఇదేదో తెలుగు ఛానెళ్లు చెబుతున్న మాట కాదు. జాతీయ మీడియా చెబుతున్న కఠోర వాస్తవం ఇది. నేషనల్ మీడియా సర్వేలో స్పష్టంగా బయటపడిన ఏపీ ప్రజల మనోగతం ఇది.

ఏపీకి 3 రాజధానులపై జాతీయ న్యూస్ ఛానెల్‌ ఇండియా టీవీ సర్వే నిర్వహించింది. పాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఏర్పాటు చేయడంపై ఏపీ ప్రజల అభిప్రాయాలు సేకరించింది. ఈ సర్వేలో ప్రజలు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. మూడింట రెండు వంతుల మంది వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని నిర్‌ద్వంద్వంగా తిరస్కరించా రు. ఇది ఫూలిష్ నిర్ణయమని ముఖం మీదే చెప్పేశారు.

ఇండియా టీవీ సర్వేలో దాదాపు 8 వేల మంది పాల్గొన్నారు. ఇందులో ఏకంగా 67 శాతం మంది మూడు రాజధానుల నిర్ణయాన్ని తప్పు బట్టారు. మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయాన్ని 29 శాతం మంది మాత్రమే సమర్దించారు. మరో 4 శాతం మంది ప్రజలు మధ్యస్తంగా ఉండిపోయారు.

వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తాము సమర్దించలేమని మెజార్టీ ప్రజలు కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వ వివరణ కూడా సంతృప్తికరంగా లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆలోచన సరిగా లేదని, ఇది మంచి పద్దతి కాదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. వైసీపీ నిర్ణయం ఇతర రాష్ట్రాల పై కూడా పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story