పోలీసుల తీరుపై ఎంపీ గల్లా జయదేవ్‌ తీవ్ర ఆగ్రహం

పోలీసుల తీరుపై ఎంపీ గల్లా జయదేవ్‌ తీవ్ర ఆగ్రహం

పోలీసుల తీరుపై ఎంపీ గల్లా జయదేవ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై లాఠీ ఛార్జ్‌ చేస్తే తుళ్లూరు మహిళలు కాపాడరన్నారు. కొందరు పోలీసులు తన చొక్కా చింపి.. గోళ్లతో గిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ కొడతానని కూడా బెదిరించారని.. 15 గంటల పాటు ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా తిప్పారని గల్లా మండిపడ్డారు. వైద్య సదుపాయం కావాలని కోరినా పట్టించుకోలేదన్నారు.

తనకు 149 సెక్షన్‌ కింద నోటీసులు ఇవ్వలేదని.. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తారని మండిపడ్డారు. ఎంపీ అయిన తనపైనే ఇంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తే.. సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పోలీసుల జీపులోనే వైద్య పరీక్షలు చేసి.. జైలుకు పంపారని గల్లా జయదేవ్‌ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story