మహానగరంలో మనకో ఇల్లు.. భాగ్యనగరమే బెస్ట్

పదేళ్ల క్రితమే నగరానికి వచ్చినా సొంత ఇల్లు కొనుక్కోవాలనే ఆలోచన రాలేదు. కానీ ఇప్పుడెందుకో ఇక్కడ మనకో ఇల్లు ఉంటే బావుండనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచించబట్టేనేమో హైద్రాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఇండిపెండెంట్ ఇల్లు ఆలోచన పక్కనపెట్టి కనీసం ఓ ఐదంతస్తుల అపార్ట్‌మెంట్‌లో ప్లాట్ కొందామన్నా అడుగు ధర ఆకాశంలో ఉంటోంది.
గత ఏడాది జులై-సెప్టెంబర్ మధ్య కాలంలోనూ తొమ్మిది శాతం పెరిగాయి. రిటైల్ ద్రవ్యోల్బణం కంటే ఇది ఎక్కువ అని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ 'నైట్ ఫ్రాంక్ ఇండియా' విడుదల చేసిన 'గ్లోబల్ రెసిడెన్షియల్ సిటీస్ ఇండెక్స్' ఈ విషయం పేర్కొంది. నివాస గృహాల ధరలు అత్యధికంగా పెరిగిన ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో హైదరాబాద్ 14వ స్థానంలో నిలిచింది.
టాప్ 20 జాబితాలో ఒక్క హైదరాబాద్ తప్ప మరే భారతీయ నగరానికి ఇందులో స్థానం లభించలేదు. 3.2 శాతం ధరల పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీ 73వ స్థానంలో ఉంటే, 2 శాతం పెరుగుదలతో బెంగళూరు 90వ స్థానంలో ఉంది. ఇక ముంబై, చెన్నై మహానగరాలు 135, 136 స్థానాల్లో ఉన్నాయి. మరి భాగ్యనగరంలో మనకో ఇల్లు.. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కొనలేమేమో. ముందు ముందు రేట్లు మరింత పెరిగే అవకాశం ఉండొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com