మార్కెట్లోకి హ్యుందాయ్ ఆరా.. మస్త్ డిమాండ్

మార్కెట్లోకి హ్యుందాయ్ ఆరా.. మస్త్ డిమాండ్

వినియోగదారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హ్యందాయ్ ఆర మంగళవారం మార్కెట్లోకి వచ్చింది. బీఎస్-6 ప్రమాణాలతో వస్తున్న ఈ కారు పలు వేరియంట్లలో లభ్యం కానుంది. కారుకు సంబంధించిన ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో రెండు ఎయిర్ బ్యాగులు, యాంటీ బ్రేకింగ్ సిస్టం, రివర్స్ పార్కింగ్ స్పెన్సర్స్, సీట్ బెల్డ్ రిమైండర్, స్పీడ్ వార్నింగ్ వంటి వసతుల్ని కల్పించారు. కొన్ని వేరియంట్లలో పార్కింగ్ కెమెరా, క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. వైర్‌లెస్ చార్జర్, డ్రైవర్ రేర్ వ్యూ మానిటర్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, 8.0 టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్ వంటి అదనపు హంగుల్నిచేర్చారు. పలు వేరియంట్లలో లభించనున్న ఈ కారు ధర వేరియంట్‌ని బట్టి ఉంటుంది. సుమారుగా రూ.5.79 లక్షల నుంచి 9.22 లక్షల మధ్య ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story