మా నాన్న గురించి నేనేం రాయను.. మంత్రిని కదిలించిన చిన్నారి వ్యాసం

మా నాన్న గురించి నేనేం రాయను.. మంత్రిని కదిలించిన చిన్నారి వ్యాసం

'నేను రెండో తరగతిలో ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా మానేయకుండా రోజూ స్కూలుకు వెళుతుంటే మా నాన్న చాలా సంతోషించేవాడు.. బాగా చదువుకుని పెద్ద ఆఫీసరవు కావాలిరా అనే వాడు.. కానీ నేను మూడో తరగతికి వచ్చేసరికి నాన్నకి టీబీ వచ్చి అమ్మని, నన్ను, నా ఇద్దరు చెల్లెళ్లను వదిలేసి వెళ్లిపోయాడు. జబ్బు తగ్గించుకోవడానికి డబ్బులు లేక నాన్నని కోల్పోయామని అమ్మ రోజూ ఏడ్చేది. నాన్న మరణించిన రోజు చాలా మంది ఇంటికి వచ్చినా ఒక్కరూ సాయం చేయలేదు. అమ్మకి కళ్లు కనిపించవు. అందుకే ఇంట్లో అమ్మకి సాయం చేసి బడికి వస్తున్నాను' అని టీచర్ నాన్న గురించి వ్యాసం రాసుకురమ్మంటే ఓ చిన్నారి ఇలా రాసుకొచ్చాడు.

మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని జిల్లా పరిషత్ స్కూల్‌లో నాల్గవ తరగతి చదువుతున్నాడు మంగేష్ వాల్కే. స్కూల్లో వ్యాస రచన పోటీలు నిర్వహిస్తూ 'మా నాన్న' అనే అంశంపై వ్యాసం రాయమని చెప్పారు విద్యార్దులతో. మంగేష్ రాసిన వ్యాసం చదివి తరగతి ఉపాధ్యాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. ఆ వ్యాసాన్ని స్నేహితుడికి పంపిచగా అతడు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్తా వైరల్‌గా మారి మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖా మంత్రి దగ్గరకు చేరింది. దీంతో మంత్రి విద్యార్థి మంగేష్‌కి ఆర్థిక సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అతడి చదువుకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.

Tags

Next Story