వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకు నిద్రపోను : పవన్ కల్యాణ్

X
రాజధాని రైతులు, మహిళలపై వైసీపీ ప్రభుత్వం చేసిన దాడి కన్నీళ్లు పెట్టిస్తోందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జగన్ సర్కార్ ను గద్దె దించేవరకు తాను నిద్రపోనని శపథం చేశారు. అమరావతి కోసం పోరాటం చేస్తున్న మహిళలతో సమావేశమైన పవన్.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అమరావతి ఎక్కడికీ పోదని.. రాజధానిని అమరావతిలోనే వుంచే బాధ్యత జనసేన, బీజేపీ తీసుకుంటున్నాయని తెలిపారు. తాను ప్రచారం కోసం పనిచేసే నాయకుడిని కాదన్న పవన్.. తాను చేతల మనిషినని అన్నారు. తాను బుధవారం ఢిల్లీకి వెళ్తున్నానని.. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అమరావతి శాశ్వత రాజధానిగా వుండేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
