వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకు నిద్రపోను : పవన్ కల్యాణ్
BY TV5 Telugu21 Jan 2020 6:34 PM GMT

X
TV5 Telugu21 Jan 2020 6:34 PM GMT
రాజధాని రైతులు, మహిళలపై వైసీపీ ప్రభుత్వం చేసిన దాడి కన్నీళ్లు పెట్టిస్తోందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జగన్ సర్కార్ ను గద్దె దించేవరకు తాను నిద్రపోనని శపథం చేశారు. అమరావతి కోసం పోరాటం చేస్తున్న మహిళలతో సమావేశమైన పవన్.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అమరావతి ఎక్కడికీ పోదని.. రాజధానిని అమరావతిలోనే వుంచే బాధ్యత జనసేన, బీజేపీ తీసుకుంటున్నాయని తెలిపారు. తాను ప్రచారం కోసం పనిచేసే నాయకుడిని కాదన్న పవన్.. తాను చేతల మనిషినని అన్నారు. తాను బుధవారం ఢిల్లీకి వెళ్తున్నానని.. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అమరావతి శాశ్వత రాజధానిగా వుండేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.
Next Story
RELATED STORIES
Atal: భారత్ మాజీ ప్రధాని జీవితంపై సినిమా.. ఫస్ట్ లుక్ రిలీజ్..
29 Jun 2022 1:30 PM GMTSamantha: సమంతకు మరో ఐటెం సాంగ్ ఆఫర్.. ఈసారి బాలీవుడ్లో..
28 Jun 2022 4:15 PM GMTPooja Hegde: బాలీవుడ్‌పై పూజా ఫొకస్.. ఎలాగైనా హిట్ కొట్టాలని...
28 Jun 2022 12:15 PM GMTRanbir Kapoor: ఏడేళ్ల తర్వాత కలిసి నటించనున్న మాజీ ప్రేమికులు..
27 Jun 2022 4:15 PM GMTNeetu Kapoor: ఆలియా ప్రెగ్నెన్సీపై రణబీర్ తల్లి నీతూ కపూర్ రియాక్షన్..
27 Jun 2022 1:05 PM GMTRanbir Kapoor: రణభీర్ ఫేవరెట్ హీరోయిన్ ఆలియా కాదట.. మరి ఎవరంటే..?
27 Jun 2022 11:00 AM GMT