తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన పిరమాల్ గ్రూప్

తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన పిరమాల్ గ్రూప్

తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీ పిరమాల్ గ్రూప్ సిద్ధమైంది. దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన పిరమాల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమాల్ ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రానున్న మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో 500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు తెలుస్తోంది. పిరమాల్ గ్రూప్‌కు ప్రస్తుతం తెలంగాణలో 1400 మంది ఉద్యోగులున్నారు. ఈ పెట్టుబడులతో అదనంగా మరో 600 మందికి ఉపాధి కల్పించేందుకు అవకాశం దక్కుతుంది.

ఇదిలావుంటే, ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నేపథ్యంలో.. ఇతర రాష్ట్రాల్లో వున్న కంపెని ప్లాంట్లను కూడా హైదరాబాద్‌కు తరలించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో తెలంగాణలో పిరమాల్ గ్రూప్ సీనియర్ ప్రతినిధుల బృందం పర్యటించనుంది. ఈ పర్యటన తర్వాత పెట్టుబడులు పట్టాలెక్కే అవకాశం వుంది.

Tags

Read MoreRead Less
Next Story