మండలి చైర్మన్ షరీఫ్ చిత్రపటానికి పాలాభిషేకం

మూడు రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించిన మండలి చైర్మన్ షరీష్‌పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు చాలాచోట్ల పాలాభిషేకాలు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో షరీఫ్‌కు ఘన స్వాగతం పలికారు. తరువాత షరీప్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అమరావతి నుంచి ఆయన నరసాపురం వెళ్తుండగా పాలకొల్లు గాంధీబొమ్మ సెంటర్‌లో జేఏసీ నాయకులు స్వాగతం పలికి.. పూల మాలలు వేసి అభినందనలు తెలియజేశారు...
అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో మండలి చైర్మన్ షరీఫ్‌కు పాలాభిషేకం చేశారు టీడీపీ కార్యకర్తలు, జేఏసీ నేతలు. మూడు రాజధానుల బిల్లును అధికార పార్టీ నాయకులు బెదిరించినా.. లెక్క చేయకుండా ధైర్యం చూపారని కొనియాడారు. మండలి చైర్మన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్స తీరును తప్పుపట్టారు..
అనంతపురం క్లాక్ టవర్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు అమరావతి పరిరక్షణ వేదిక నేతలు. వైసీపీ పాలనలో రౌడీ రాజ్యం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆరోపించారు. నిబంధనల ప్రకారం నడుచుకున్న మండలి చైర్మన్‌పై వైసీపీ మంత్రులు దాడి చేయడానికి ప్రయత్నించడం దారుణమన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com