అమెరికాలో కూలిపోయిన విమానం

అమెరికాలో ఓ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. దక్షిణ కాలిఫోర్నియాలోని కరోనా మున్సిపల్ ఎయిర్ పోర్టులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కరోలినా ఎయిర్ పోర్టులో విమానం టేకాప్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పక్కనే ఉన్న బారికేడ్ లను తాకింది. వెంటనే మంటలు వ్యాపించడంతో అందులో ఉన్నవారు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే విమానాశ్రయాన్ని మూసివేసిన అధికారులు, దీనిపై ఏవియేషన్, నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేప్టీ బోర్డు విచారణకు ఆదేశించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసినా అందులోని ఏ ఒక్కరు ప్రాణాలతో బయటపడలేక పోయారు.

Tags

Read MoreRead Less
Next Story