గురువారం మూడు కీలక పిటిషన్లపై హైకోర్టులో విచారణ

గురువారం మూడు కీలక పిటిషన్లపై హైకోర్టులో విచారణ

రాజధాని తరలింపు, సీఆర్డీఏ రద్దును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో గురువారం విచారణ జరగనుంది. బుధవారం మండలిలో చర్చ జరుగుతున్నందున.. ఆ విషయాన్ని ఏజీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విచారణ గురువారంకి వాయిదా పడింది. దాంతో పాటు.. హైకోర్టు తరలింపు, సీఆర్డీఏకు రైతులు అర్జీలు ఇచ్చే గడువు పెంపు పిటిషన్లపైనా విచారణ జరగనుంది. అటు.. రాజధాని వ్యాజ్యాల విచారణకు హైకోర్టు సీజే నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహిశ్వరి, జస్టిస్‌ శేషసాయి..జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం రాజధాని అమరావతి, సీఆర్డీఏ అంశాలతో ముడిపడిన.. వ్యాజ్యాలు అన్నీ విచారించనుంది.

Tags

Next Story