బాబు అనుభవం ముందు ఘోరంగా విఫలమైన వైసీపీ వ్యూహం
వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడంలో అనుభవానికి మరోసారి పెద్ద పీట పడింది. అవును.. ఎట్టి పరిస్థితిల్లోనూ వికేంద్రీకరణ బిల్లు.. సెలెక్ట్ కమిటీకి వెళ్లకూడదని గట్టి పట్టుదలతో ఉన్న వైసీపీ సర్కారు వ్యూహం.. చంద్రబాబు అనుభవం ముందు ఘోరంగా విఫలమైంది. ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీ బాట పట్టేలా చేయడంలో టీడీపీ అధినేత వ్యూహం ఫలించింది. ఆఘమేఘాలమీద వికేంద్రీకరణ ప్రక్రియ ముగించాలని భావించింది వైసీపీ సర్కారు. అందుకే ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదించుకుని.. మండలిలోనూ విజయం సాధించాలని భావించింది. అయితే.. మండలి ఛైర్మన్.. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకోవడంతో.. వైసీపీ సర్కారు ఆశలు అడియాశలయ్యాయి. దీంతో ఈ బిల్లు ప్రక్రియ ముగిసేందుకు కనీసం ముడు నెలలు పట్టే అవకాశం ఉంది.
ఓటింగ్ నేపథ్యంలో.. టీడీపీ సభ్యులను తమవైపు లాగేయాలని వైసీపీ అనేక ప్రయత్నాలు చేసింది. ఇందుకోసం మంత్రులంతా.. మండలిలోనే ఉండి.. సెలెక్ట్ కమిటీకి పంపకుండా తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరికి.. మండలి ఛైర్మన్ పోడియంను సైతం చుట్టు ముట్టారు. అయితే.. వైసీపీ వ్యూహాలను ముందే పసిగట్టిన చంద్రబాబు.. ఏకంగా గంటన్నర పాటు శాసన మండలి గ్యాలరీలోనే కూర్చుకున్నారు. మండలి ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయడంతో.. అక్కడికి చేరుకున్న ఆయన.. గ్యాలరీలో ఉండి.. చివరకు బిల్లులను సెలెక్ట్ కమిటీని పంపడంలో కీలక పాత్ర పోషించారు.
శాసన మండలి నిర్ణయం తర్వాత చంద్రబాబుకు మందడంలో ఘనస్వాగతం పలికారు. రైతులకు అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు సాగారు. అటు లోకేష్ తోపాటు ఇతర టీడీపీ నేతలకు ఘనంగా స్వాగతం పలికారు రాజధాని గ్రామ రైతులు. మందడం రోడ్డుపైకి వచ్చి సేవ్ అమరావతి అంటూ.. నినాదాలు చేశారు. జాతీయ జెండాలు పట్టుకుని జై అమరావతి అంటూ అనేక చోట్ల ర్యాలీలు నిర్వహించారు. మండలి ఛైర్మన్ తాజా నిర్ణయంతో.. సెలెక్ట్ కమిటీ ప్రక్రియకు మూడు నెలల సమయం పడుతోంది. దీంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రాజధాని రైతులు.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com