మందడంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై పూల వర్షం

మందడంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై పూల వర్షం

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకీ పంపుతున్నట్లు ఏపీ మండలి ఛైర్మన్ షరీఫ్‌ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు, రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు. మందడం రహదారిపై వచ్చి సేవ్‌ అమరావతి అంటూ నినాదాలు చేశారు. జాతీయ జెండాలు పట్టుకుని పలు చోట్ల ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

మూడు రాజధానులు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలన్న నిర్ణయంపై రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మందడం రైతులు ఆనందం వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబుపై పూల వర్షం కురిపించారు. జై అమరావతి.. జైజై అమరావతి అంటూ నినాదాలు చేశారు రైతులు.

Read MoreRead Less
Next Story