న్యూజెర్సీ ప్రభుత్వం ఎన్నారైలకు ఊరట

అమెరికాలోని న్యూజెర్సీ ప్రభుత్వం ఎన్నారైలకు ఊరల లభించే చర్యలను చేపట్టింది. H1b వీసా తో న్యూజెర్సీలో ఉన్న వారి పిల్లలకు ఫీజులు తగ్గించేలా కొత్తచట్టం తీసుకొచ్చింది. దీంతో తెలుగువారు ఎక్కువగా నివసించే న్యూజెర్సీలోని ప్రవాసాంధ్రుల పిల్లల చదువుల భారం తగ్గనుంది. నూతన చట్టంపై న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్పీ సంతకం చేశారు.

కొత్త చట్టం ప్రకారం H1b వీసాదారులైన తల్లిదండ్రులు, గార్డియన్ల పిల్లలకు కాలేజీ, యూనివర్సీటి కోర్సుల్లో అవుట్ ఆఫ్ స్టేట్ ట్యూషన్ ఫీజు ఉండదు. ఫీజుల తగ్గింపు పొందాలంటే వారి పిల్లలు న్యూజెర్సీ హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. లేదా న్యూజెర్సీ హైస్కూల్లో 3 సంవత్సరాలు చదవి ఉండాలనే షరతుల్లో ఒకటి తప్పనిసరి. దీంతో న్యూజెర్సీలో ఉన్న వేలాదిమంది ప్రవాస తెలుగువారి పిల్లలు లబ్దిపొందనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story