ఫిబ్రవరి 2న రైతులకు మద్దతుగా లాంగ్ మార్చ్ నిర్వహిస్తాం: పవన్

ఫిబ్రవరి 2న రైతులకు మద్దతుగా లాంగ్ మార్చ్ నిర్వహిస్తాం: పవన్

రాజధాని రైతులకు అండగా ఉంటామని జనసేన అధినేతే పవన్‌ మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీలో అమరావతి తరలింపు.. రైతుల ఆందోళనలపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. నడ్డాతో భేటీ తరువాత మాట్లాడిన పవన్‌.. కేంద్రం అనుమతితోనే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామన్న వైసీపీ వాదనలో నిజం లేదన్నారు. ఈ విషయాన్ని కేంద్రం తనకు స్పష్టం చేసిందని పవన్ చెప్పారు. ఫిబ్రవరి 2వ తేదీతో జనసేన-బీజేపీ కలిసి రైతులకు మద్దతుగా లాంగ్ మార్చ్‌ నిర్వహిస్తుందన్నారు.

మూడు రాజధానుల అంశం తమ వద్దకు రాలేదని ఏపీ కో-ఇంచార్జ్ సునీల్ దేవ్‌ధర్ కూడా తెలిపారు. అమరావతి రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

Tags

Next Story