పెరుగు తోడు పెట్లేదా.. నో ప్రాబ్లమ్.. ఈ ఫ్రిజ్ ఉంటే చాలు..

పెరుగు తోడు పెట్లేదా.. నో ప్రాబ్లమ్.. ఈ ఫ్రిజ్ ఉంటే చాలు..

హ్యాపీ.. పెరుగుతోడు పెట్టే పన్లేదు.. ఫ్రిజ్ బాక్స్‌లో పాలు పోస్తే చాలు.. శుభ్రంగా అదే పెరుగైపోతుంది. కొత్త టెక్నాలజీ.. ఎన్నో ఈజీ టెక్నిక్స్‌ని మన ముందుకు తీసుకొస్తోంది. ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ తాజాగా ఓ కొత్త రకం ఫ్రిజ్‌ని మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇందులో కర్డ్ మేస్ట్రో అనే ఆప్షన్ ఉంది. ఇందులో పాలు పోస్తే ఆరుగంటల్లో ఆటోమేటిగ్గా పెరుగు సిద్దమవుతుందని సంస్థ పేర్కొంది. పాలు.. పెరుగాగా మార్చే ఫెర్మెంటేషన్ ప్రక్రియను ఈ ఫ్రిజ్‌లో పొందు పరిచింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ అర ఉంది. 244 లీ. నుంచి 336 లీ. దాకా సామర్ధ్యం ఉండే కర్డ్ మేస్ట్రో రిఫ్రిజిరేటర్ల ధర రూ.30,990 నుంచి రూ.45,990 దాకా ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story