ఆంధ్రప్రదేశ్

సభ్యుల హక్కులను పరిరక్షించేలా జోక్యం చేసుకోవాలని గవర్నర్ కు టీడీపీ లేఖ

సభ్యుల హక్కులను పరిరక్షించేలా జోక్యం చేసుకోవాలని గవర్నర్ కు టీడీపీ లేఖ
X

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం మార్షల్స్ సహాయంతో తమపై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు.సభ్యుల హక్కులను పరిరక్షించేలా గవర్నర్ జోక్యం చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల ఆదేశాలతో స్పీకర్ ఎటువంటి తీర్మానం లేకుండా మమ్మల్ని బయటకు పంపించారు అని టీడీపీ శాసనసభ్యులు పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని వారు గవర్నర్‌ను అభ్యర్థించారు. స్పీకర్ అధికార పార్టీ సభ్యులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తద్వారా ప్రతిపక్ష సభ్యులపై వివక్ష చూపుతున్నారని టిడిపి ఎమ్మెల్యేలు గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES