ఓ వేశ్య బయోపిక్‌.. దీపిక రిజక్ట్ చేస్తే ఐశ్వర్య ఓకే చేస్తూ..

ఓ వేశ్య బయోపిక్‌.. దీపిక రిజక్ట్ చేస్తే ఐశ్వర్య ఓకే చేస్తూ..

కొన్ని సినిమాల్లో ముందు ఒకరిని అనుకుంటారు.. ఆ తరువాత ఆ పాత్ర మరొకరిని వరిస్తుంది. అదే సినిమా సూపర్ డూపర్ హిట్టైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ దర్శకుడు ప్రదీప్ సర్కార్ ఓ వేశ్య జీవితాన్ని తెరకెక్కిస్తున్నారు. అందులో నటించమంటూ ముందుగా దీపికా పదుకోన్‌ని అడిగారు. కానీ ఆమె వివిధ కారణాల వలన నటించనని చెప్పిందట. మరోనటి ఐశ్వర్యారాయ్ బచ్చన్‌ను సంప్రదించగా ఆమె కథ విని నటించేందుకు ఆసక్తి కనబరిచిందని దర్శకుడు సర్కార్ తెలిపారు.

ఇంతకీ ఆ పాత్ర విషయానికి వస్తే.. వేశ్య నుంచి రంగస్థల నటిగా మారి ఆ తర్వాత గాయనిగా ఎదిగిన బోదిని దాసి జీవితం గురించి. ఆమె బయోపిక్‌లో ఐశ్వర్య నటించబోతోంది. 19వ శతాబ్దంలో బెంగాల్‌కు చెందిన వేశ్య బినోదిని.. రంగస్థల నటిగా మారి ఆ తరువాత నాటకాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. తరువాత గాయనిగా మారిన ఆమె ప్రస్థానం ఎంతో మందికి ఆదర్శం. ప్రస్తుతం ఐశ్వర్య మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'పొన్నియిన్ సెల్వన్' చిత్రంలో నటిస్తోంది. అది పూర్తయిన తరువాత ఈ బయోపిక్ పట్టాల మీదకు వెళుతుంది.

Tags

Read MoreRead Less
Next Story