వైసీపీ తీరుపై గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు ఫిర్యాదు చేయనున్న చంద్రబాబు

వైసీపీ తీరుపై గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు ఫిర్యాదు చేయనున్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు.. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ ను కలవనున్నారు.. ఇటీవల మండలిలో జరిగిన పరిణమాలను ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్సీలు, మంత్రులు మండలిలో వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేయనున్నారు. అలాగే మండలి చైర్మన్ ను మంత్రులు దూషించిన తీరును కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. మరోవైపు 38 రోజులుగా రాజధాని రైతులు ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరనున్నారు.

Tags

Next Story