ఇంట్లో ఉండే చదువుకోవచ్చు.. 'ఇగ్నో'లో ఎన్నో కోర్సులు.. ఈ నెలాఖరులోపు దరఖాస్తు..

ఇంట్లో ఉండే చదువుకోవచ్చు.. ఇగ్నోలో ఎన్నో కోర్సులు.. ఈ నెలాఖరులోపు దరఖాస్తు..

చదువు పట్ల ఇష్టం.. చదువుకోవాలనే ఆలోచన ఉండాలే కాని వయసుతో పనేముంది. చదువుకోవాలనే పట్టుదల ఉంటే ఇంట్లో ఉండి కూడా చదువుకోవచ్చు. ఈ అవకాశం ఎన్నో యూనివర్సిటీలు కల్పిస్తున్నాయి. అందులో ఒకటి ఇగ్నో- ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ ఎన్నో కోర్సులు అందిస్తోంది. ఇటీవలే జనవరి 2020 సెషన్ అడ్మిషన్ల కోసం దరఖాస్తు గడువును జనవరి 31 వరకు పొడిగించింది. ఇందులో 6 నెలల సర్టిఫికెట్ కోర్సులు, డిప్లొమా కోర్సులు, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు, రీసెర్చ్ ప్రోగ్రామ్ కోర్సులు ఉన్నాయి. ప్రతి ఏటా రెండు సార్లు అడ్మిషన్లను స్వీకరిస్తుంది ఇగ్నో. జనవరితో పాటు జులైలోనూ అడ్మిషన్లు ఉంటాయి. ప్రస్తుతం జనవరి సెషన్ అడ్మిషన్లు జరుగుతున్నాయి. కోర్సుల వివరాలు, అడ్మిషన్లకు సంబంధించిన వివరాల కోసం https://ignouradmission.samarth.edu.in/ వెబ్‌సైట్ చూడొచ్చు. ముందుగా https://ignouadmission.samarth.edu.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. 29 మాస్టర్స్ డిగ్రీలను, 19 బ్యాచిలర్స్ డిగ్రీలను, 61 డిప్లొమా కోర్సులు, 80 సర్టిఫికెట్ కోర్సులను ఇగ్నో అందిస్తోంది. డిజిటల్ స్టడీ మెటీరియల్ కావాలనుకుంటే అడ్మిషన్ ఫీజులో 15% డిస్కౌంట్ లభిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story