భారత్ శుభారంభం.. తొలి టీ20 లో గెలుపు

న్యూజిలాండు తో జరిగిన తొలి టీ20 లో భారత్ ఆరువికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 204 పరుగుల భారీ టార్గెట్‌ను భారత్ ముందు ఉంచింది. న్యూజిలాండ్ ఆది నుంచి పరుగుల మోత మోగించింది. పవర్ ప్లే ముగిసేసరికి కివీస్ వికెట్ కోల్పోకుండా 68 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఆటగాళ్లు మన్రో (59), రాస్ టేలర్(54), విలియంసన్ (51) పరుగులు చేశారు. గుప్తిల్ 30 పరుగుల రాణించడంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ సాధించింది. ఇక ఛేజింగ్ కు దిగిన టీమిండియా ఓవర్ మిగిలి ఉండగానే లక్షాన్ని ఛేదించి శుభారంభాన్ని ఇచ్చింది. ఓపెనర్ రోహిత్ శర్మ(7) విఫలమయ్యాడు. కేఎల్ రాహుల్(56; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లి(45; 32 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్(58 నాటౌట్; 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగిపోయారు. దీంతో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com