మున్సిపల్ ఎలక్షన్ కౌంటింగ్‌కు పూర్తైన ఏర్పాట్లు

మున్సిపల్ ఎలక్షన్ కౌంటింగ్‌కు పూర్తైన ఏర్పాట్లు

శనివారం జరుగనున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 15 మున్సిపాలిటీల్లో 15 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. హోరాహోరీగా జరిగిన 118 వార్డుల ఫలితాలు శనివారం వెల్లడి కానున్నాయి. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు నిజామాబాద్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతివార్డుకు ఒక టేబుల్ వేసి.. ప్రతిరౌండ్‌లో వెయ్యి ఓట్లు లెక్కించనున్నారు. కౌంటింగ్ కు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలక్షన్ ఫలితాలపై రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story