విశాఖ రాజధాని అయితే వైసీపీ గుండాలు ఇంకాస్తా రెచ్చిపోతారు : టీడీపీ నేత బైరెడ్డి

విశాఖ రాజధాని అయితే వైసీపీ గుండాలు ఇంకాస్తా రెచ్చిపోతారు : టీడీపీ నేత బైరెడ్డి

విశాఖలో వైసీపీ కార్యకర్తల రెచ్చిపోయారు.. తూర్పు నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కార్యాలయంపై దాడి చేశారు.. అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఫ్లెక్సీలను చింపి పెట్రోల్‌ పోసి తగలబెట్టారు.. దీంతో ఎమ్మెల్యే వెలగపూడి అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రశాంత విశాఖలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ చూడలేదన్నారు జిల్లా టీడీపీ కార్యదర్శి బైరెడ్డి పోతన రెడ్డి.. విశాఖ రాజధాని అయితే వైసీపీ గుండాలు ఇంకాస్తా రెచ్చిపోతారని.. అందుకే మెజార్టీ విశాఖ వాసులు రాజధానిని కోరుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story