ఆంధ్రప్రదేశ్

ఎంఐఎం సభకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

ఎంఐఎం సభకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌
X

హైదరాబాద్‌లో ఈ నెల 25న ఎంఐఎం సభకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొన్ని షరతులతో.. సభకు అనుమతి ఇచ్చింది హైకోర్టు. ఎలాంటి ర్యాలీ చేయకూడదని, కేవలం సభ మాత్రమే జరుపుకోవాలని ఆదేశించింది. రిపబ్లిక్‌ డేకు ముందు రోజు ఎంఐఎం సభకు అనుమతి ఇవ్వొద్దంటూ.. ఉమమహేంద్ర అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. షరతులతో ఎంఐఎం సభకు పర్మిషన్‌ ఇచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సభ జరుపుకోవచ్చని తెలిపింది. సభ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేయాలంటూ...తెలంగాణ డీజీపీకి హైకోర్టు ఆదేశించింది. ఎక్కడా అల్లర్లు జరగకుండా చూడాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.

Next Story

RELATED STORIES