నల్గొండలో కాంగ్రెస్‌, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ

నల్గొండలో కాంగ్రెస్‌, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కారు సెంచరీ దిశగా దూసుకుపోతోంది. దాదాపు కౌంటింగ్ జరుగుతున్న అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ జోరుకు తిరుగులేకుండా పోతోంది. ఇప్పటికే 100కి పైగా మున్సిపాలిటీల్లో గులాబీ జెండ రెప రెపలాడుతోంది. అయితే నల్గొండ పురపాలక ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో ఇప్పటి వరకు తెరాస 8 చోట్ల విజయం సాధించింది. ఇక కాంగ్రెస్‌ 6 స్థానాలను సొంతం చేసుకుంది. భాజపా, స్వతంత్ర అభ్యర్థులు చెరో స్థానంలో విజయం సాధించారు. దేవరకొండ మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటి వరకు 7 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. తెరాస 4, కాంగ్రెస్‌, భాజపా, స్వతంత్రులు ఒక్కో స్థానంలో విజయం సాధించారు. మరోవైపు యాదగిరి గుట్ట పురపాలికలో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉంది. హాలియా, చిట్యాల, చండూర్‌ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీ ఇస్తోంది. ఆయా మున్పిపాలిటీల్లో హస్తం‌, కారు మధ్య హోరా హోరీ పోటీ కొనసాగుతోంది. నందికొండ మున్సిపాలిటీకి వెలువడిన 4 ఫలితాల్లో తెరాస 3 కాంగ్రెస్‌ ఒక చోట విజయం సాధించాయి.

Tags

Read MoreRead Less
Next Story