39వ రోజు కూడా 29 గ్రామాల్లో తగ్గని నిరసనల హోరు

39వ రోజు కూడా 29 గ్రామాల్లో తగ్గని నిరసనల హోరు
X

అమరావతి ఆందోళనలు రోజు రోజుకూ మరింత ఉధృమవుతున్నాయి. రాజధానిగా అమరావతే ఉండాలంటూ రైతులు, మహిళలు ఉదయాన్నే రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.. 39వ రోజు కూడా 29 గ్రామాల్లో నిరసన హోరు ఇంకాస్త పెరిగింది. సేవ్‌ అమరావతి అంటూ నినాదాలు మిన్నంటుతున్నాయి.

మందడం నుంచి అనంతవరం వరకూ రైతులు పాదయాత్ర చేపట్టనున్నారు. వెంకన్న కొండకు పాదయాత్రగా మహిళలు, రైతులు వెళ్లనున్నారు. మందడం, వెలగపూడి, తుళ్లూరు మీదుగా ఈ పాదయాత్ర సాగనుంది. తరువాత అనంతవరం వెంకన్నకు రాజధాని రైతులు మొక్కులు చెల్లించుకోనున్నారు.

మందడం, తుళ్లూరుల్లో శనివారం కూడా ధర్నాలు, ఆందోళనలు కొనసాగనున్నాయి. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని రైతులు మండిపడుతున్నారు. మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కు తగ్గే వరకు తమ ఆందోళన ఆగదంటూ హెచ్చరిస్తున్నాయి. అటు గవర్నర్‌ త్వరగా జోక్యం చేసుకోవాలని విపక్షాలు కోరుతున్నాయి.

Next Story