అలాంటి నిర్ణయమే జరిగితే.. మా పోరాటం ఉద్దృతమే : టీడీపీ నేతలు

అలాంటి నిర్ణయమే జరిగితే.. మా పోరాటం ఉద్దృతమే : టీడీపీ నేతలు
X

మండలిలో జరిగిన పరిణమాలను తమ అధినేత చంద్రబాబు గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు టీడీపీ నేతలు రామానాయుడు, అశోక్‌బాబు. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు, మంత్రులు వ్యవహరించిన తీరును వివరించినట్లు తెలిపారు. 38 రోజులుగా రాజధాని రైతులు ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. ఏలాంటి రిపోర్ట్‌ రాకుండానే మూడు రాజధానుల ప్రకటన చేసిన సీఎం జగన్.. మండలిని సైతం రద్దు చేసేందుకు రెడీ అవుతున్నారన్నారు. అలాంటి నిర్ణయమే జరిగితే.. తమ పోరాటం ఉద్దృతమవుతుందన్నారు.

Tags

Next Story