పద్మశ్రీ.. దళవాయి! తోలుబొమ్మల కళకు అత్యున్నత గుర్తింపు

పద్మశ్రీ.. దళవాయి! తోలుబొమ్మల కళకు అత్యున్నత గుర్తింపు

జానపద కళా రూపమైన తోలుబొమ్మలాటకు అత్యున్నత గుర్తింపు లభించింది. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం నిమ్మల కుంట గ్రామంలో ఆనందోత్సవాలు వెలుస్తున్నాయి . దేశంలోనే అత్యున్నత పురస్కారం తనకు లభించడం కలవై చలపతిరావు తో పాటు కుటుంబ సభ్యులు ఆనందంతో పరవశించి పోతున్నారు.

తోలుబొమ్మలాట ఊపిరిగా గడిపిన దళవాయి చలపతిరావు కు పద్మశ్రీ లభించడం పట్ల నిమ్మలకుంట గ్రామస్తులతో పాటు ధర్మవరం పట్టణ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిమ్మలకుంట గ్రామానికి చేరుకొని దళవాయి ని పూలమాలలతో సత్కరిస్తున్నారు.

90 ఆమడ దూరం పోయి తోలుబొమ్మలాట చూడాలనేది పెద్దల మాట ప్రాచీన కాలం నుంచి ఈ కళకు ఎంతో ఆదరణ ఉంది నవీన ప్రపంచంలో లో రావడంతో ఈ కళకు ప్రాధాన్యత తగ్గి మరుగున పడింది అయినా కానీ తమ అ వారసత్వ సంపదగా బతికించడం కోసం గ్రామస్తులు కష్టనష్టాలకు ఓర్చి ఈ కళను బ్రతికిస్తున్న అంటే ఈ కళ పట్ల ఉన్న మమకారం ఏమిటో ఇట్టే అర్థమవుతోంది.

దేశవిదేశాల్లో 25 జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు సొంతం చేసుకున్న చరిత్ర నిమ్మలకుంట గ్రామస్తులది. తోలుబొమ్మలాటకు అనేక పురస్కారాలు వచ్చినా భారత ప్రభుత్వం తమకు గుర్తించడంలో ఆలస్యం జరిగినా మూడు సంవత్సరాలు తాను నిరంతరంగా పద్మశ్రీ కోసం దరఖాస్తు చేసుకున్నానని .. 3 సంవత్సరాలుగా తమ కళ కు గుర్తింపు కోసం పద్మశ్రీ కోసం దరఖాస్తు చేసుకుంటున్నానని ..తమ కళ గుర్తించి భారత దేశంలోనే అరుదైన పద్మశ్రీ ఈ అవార్డును ఈ కళకు ఇవ్వడం పట్ల భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. పదేళ్ళ ప్రాయం నుంచి ప్రస్తుతం 80 ఏళ్ల వయసు చేరిన తోలుబొమ్మ లాట ను జీవితంగా ఆయన ముందుకు సాగుతున్నారు. తమ గ్రామంలో ఉన్న అందరూ ఈ కళ ఆధారపడి జీవనాధారాన్ని పొందలేక ఇతర వృత్తుల పై వెళ్లిన 30 కుటుంబాలు ఆధారపడి జీవనం సాగించే విధంగా ఆయన వారందరిని ఏకం చేసి తమ పూర్వీకులు అందించిన అరుదైన ఈ యొక్క కళ నశించి పోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాడు

జీవంలేని బొమ్మలతో సజీవ దృశ్య ప్రదర్శనే తోలుబొమ్మలాట భారతీయ జానపద కళారూపాలు విశిష్ట స్థానం పొందిన తోలుబొమ్మలాటకు ఎన్నో దశాబ్దాల తర్వాత జాతీయ అత్యున్నత గుర్తింపు లభించడం పట్ల అనంతపురం జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 25 వేల మంది పద్మశ్రీ కోసం దరఖాస్తు చేసుకోగా 118 మందికి పద్మశ్రీ అవార్డు లభించడం అందులో దళపతి దళవాయి చలపతిరావు కు ఈ అవార్డు రావడం పట్ల అనంతపురం వాసులు గర్వంగా ఫీల్ అవుతున్నారు.

తన కళ నైపుణ్యాన్ని ప్రజలకు చూపించి వారిని ఆనంద పారవశ్యం చేయడంలో ఆయనకు ఆయనే సాటి ఇలా తోలుబొమ్మల కళ విశిష్టతను దేశానికి కాకుండా ఖండాంతరాలకు వ్యాపింప జేసే జానపద కళకు ఆయన జీవం పోస్తున్నారు కుమారుడైన భార్య సరోజమ్మ కుమారులు రమణ వెంకటేష్ తో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.పురాణ గాథలను ఆధారంగా చేసుకుని అందుకు తగ్గట్టుగా హాస్యం నింపి కడుపుబ్బా నవ్విస్తూ కలను పండించడంలో దళవాయి చలపతిరావు దిట్ట అంతటి విశేష అనుభవం కృషి ఉన్న ఆయనను ఎన్నో అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి తన సుదీర్ఘ నట జీవితంలో జాతీయ అంతర్జాతీయ అవార్డులు అనేకం ఆయనకు వరించాయి.

1988లో న్యూఢిల్లీలో నేషనల్ అవార్డు విజేత గా, 1991లో జర్మనీ అప్రిసియేషన్ సర్టిఫికెట్,1995లో అనంతపురంలో కళ నీరాజనం 1997లో గోల్డెన్ జూబ్లీ అవార్డు 1999 లో ఫ్రెండ్స్ అప్లికేషన్ సర్టిఫికెట్ 2000 సంవత్సరంలో హైదరాబాద్ శిల్పారామంలో సత్కారం సర్టిఫికెట్ 2003లో విజయవాడ కృష్ణ హోటల్ సర్టిఫికెట్ 2005లో న్యూఢిల్లీలో సర్టిఫికెట్ 2006లో న్యూఢిల్లీలో శిల్ప గురు అవార్డు 2011 సంవత్సరంలో అనంతపురంలో అనంతరం సర్టిఫికెట్ ఇలా కొన్ని పదుల సంఖ్యలో ఆయనను జాతీయ అంతర్జాతీయ అవార్డులు వరించాయి అత్యున్నత పద్మశ్రీ పురస్కారం లభించడం పట్ల తో పాటు అనంతపురం జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాచీన జానపద కళకు తగిన గుర్తింపు లభించిందని. సుదీర్ఘకాలంగా తోలుబొమ్మల కళ లో తన జీవితాన్ని అంకితం చేసిన దళవాయి కి పద్మశ్రీ పురస్కారం రావడం తోలుబొమ్మల కళాకారులందరికీ ఈ పురస్కారం లభించినట్లు అనంత వాసులు భావిస్తున్నారు

Tags

Read MoreRead Less
Next Story