తెలుగు రాష్ట్రాల్లో అర్థరాత్రి భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

తెలుగు రాష్ట్రాల్లో అర్థరాత్రి భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

తెలుగు రాష్ట్రల్లో భూకంపం సంభవించింది. దీంతో ఒక్కసారిగా జనం భయాందోళనకు గురయ్యారు. కృష్ణాజిల్లా పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. రాత్రి 2 గంటల 38 నిమిషాల సమయంలో స్పల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. కృష్ణాజిల్లాలోని నందిగామ, నియోజకవర్గం పరిధిలోని చందర్లపాడు, కంచికచెర్ల, వీరులపాడు, నందిగామ 3-5 సెకండ్ల పాటు కంపించిన భూమి కంపించింది. దీంతో ఒక్క సారిగా జనం రోడ్ల మీదకు పరుగులు తీసారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు మండలల్లో రాత్రి 2 గంటల 37 నిమిషాలకు కొన్ని గ్రామాలలో లో సుమారు 6 నుంచి 8సెకండ్ల వరకు కంపిచిన భూమి.

గుంటూరు జిల్లా మాచవరం మండలం కొత్తపాలెం గ్రామంలో కొంతసేపు భూకంపం సంభవించింది. 2 పర్యాయములు ఈ భూకంపం రావడంతో గమనించిన ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కొందరు ఇంట్లో నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు .

అటు తెలంగాణలోని నల్గొండ, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, టోలిచౌకి ప్రాంతాల్లో స్వల్ప భూకంపం. అర్ధరాత్రి కొన్ని సెకన్లు పాటు కంపించిన భూమి. నిద్రపోతున్న జనం భయంతో బయటకు పరుగులు తీశారు. ఇళ్లల్లో వస్తువులు కదిలాయి. భూమి పొరల్లో స్వల్ప సర్దుబాటు ఫలితంగా భూకంపం ప్రకంపనలు వచ్చాయని..భయపడాల్సిన అవసరం లేదంటున్నారు శాస్త్రవేత్తలు.

Tags

Read MoreRead Less
Next Story