40వ రోజుకు చేరిన అమరావతి కోసం పోరాటం

40వ రోజుకు చేరిన అమరావతి కోసం పోరాటం

అమరావతి కోసం పోరాటం కొనసాగుతోంది. ఇవాళ 40వ రోజుకు చేరింది. రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు, యువకులు నిరసనలు తెలుపుతున్నారు. నిన్న మందడం నుంచి వెలగపూడి, తుళ్లూరు మీదుగా పాదయాత్రగా అనంతవరం వెళ్లి.. అక్కడి వెంకన్నకు రాజధాని మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ ఉద్దండరాయునిపాలెంలో మహిళలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతే ఉండాలంటూ.. భూములిచ్చిన రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. మందడం, తుళ్లూరులో రైతులు ధర్నా నిర్వహిస్తున్నారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం సహా.. రాజధాని గ్రామాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. జాతీయ పతాకాలను చేతబట్టి రైతులు, మహిళలు ఉద్యమిస్తున్నారు.

Tags

Next Story