జగన్ మోహన్‌ రెడ్డి రైతు ద్రోహిగా దిగజారిపోయారు : నారా లోకేష్

జగన్ మోహన్‌ రెడ్డి రైతు ద్రోహిగా దిగజారిపోయారు : నారా లోకేష్

వైసీపీ కార్యకర్తల అరాచకాలతో ప్రశాంగా సాగుతున్న అమరావతి ఉద్యమం ఉద్రిక్తంగా మారింది. గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అమరావతి దీక్షా శిబిరానికి నిప్పు పెట్టారు. అంతటితో ఆగకుండా మాజీ ఎమ్మెల్యేపై దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రాజధాని కోసం భూములిచ్చి రైతులు.. గత 36 రోజులుగా దీక్షలు చేస్తూనేవున్నారు. నిరసన తెలిపే విషయంలో ఎక్కడా హద్దులు మీరలేదు. అసెంబ్లీ ముట్టడి వంటి కార్యక్రమంలో, అమరావతి ప్రజలే దెబ్బలు తిన్నారుగానీ.. ప్రభుత్వ ఆస్తులకు ఆటంకం కలిగించలేదు. ఇలా ప్రశాంతంగా సాగుతున్న ఉద్యమాన్ని, హింసాత్మకంగా మార్చేందుకు.. నిజమైన పెయిడ్ ఆర్టిస్ట్ లు బయలు దేరారు.

అమరావతిలోనే రాజధాని కొనసాగాలని.. గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్‌ కార్యాలయం వద్ద.. జేసీఏ నేతలు, టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఒక శిబిరం ఏర్పాటు చేసుకుని, గత కొన్ని రోజులుగా, నిరసన చేపడుతున్నారు. అయితే, ఇవాళ అక్కడకు చేరుకున్న వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. తమకు ఈ రాష్ట్రంలో ఏదైనా చేసే లైసెన్స్ ఉందనే రీతిలో రెచ్చిపోయారు.

ముందుగా దీక్షా శిబిరంపై వైసీపీ కార్యకర్తలు టమాటాలు కోడిగుడ్లతో దాడి చేశారు. తరువాత దీక్షా శిబిరానికి నిప్పు పెట్టరు. దీంతో వెంటనే తెలుగుదేశం కార్యకర్తలు, వారిని ఆపే ప్రయత్నంలో తోపులాట జరిగింది. అక్కడ దీక్షలో ఉన్న మహిళలకు కూడా గాయాలయ్యాయి. దీక్షా శిబిరానికి మంటలు వ్యాపించకుండా, మంటలు ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఈ క్రమంలోనే తెనాలి టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహ్మద్‌ ఖుద్దూస్‌ను వైసీపీ కార్యకర్తలు విచక్షణారహితంగా కొట్టారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అక్కడు రాగా.. ఆయన పై కూడా కోడి గుడ్లతో దాడిచేశారు. దీంతో అక్కడ వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడే వున్న పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు.

మండలిలో బిల్లు ఓడిపోవటంతో వైసీపీ ఉన్మాది చేష్టలు బయట పడుతున్నాయని.. ఇవి ఇంకా ఇంకా ఎక్కువ అవుతాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. అటు దాడిపై మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో స్పందించారు. రైతులపై దాడి చేయించిన జగన్ మోహన్‌ రెడ్డి రైతు ద్రోహిగా దిగజారిపోయారని అన్నారు. వైసీపీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని.. జగన్ గారి తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదని లోకేష్‌ ట్వీట్ చేశారు.

చిత్తూరు జిల్లా కుప్పంలోనూ రాజధాని రగడ రాజుకుంది. మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దు అన్న నినాదంతో... టీడీపీ పిలుపు ఇవ్వడంతో... ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు.. రోడ్డుపైకొచ్చి నిరసనలు తెలిపారు. అటు... వైసీపీ నేతలు కూడా... టీడీపీకి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. టీడీపీ, వైసీపీ నేతలు ఎదురు పడటంతో... టెన్షన్‌ వాతావరణం నెలకొంది. రెండు వర్గాల మధ్య తోపులాట జరగగా.. పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలకు గాయాలయ్యాయి.

పరిస్థితి చేయిదాటిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి... చక్కదిద్దారు. కుప్పంలో గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగకపోవడంతో.. స్థానికులు ఒక్కసారిగా షాక్‌ గురయ్యారు.

Tags

Next Story