ఏపీ సచివాలయంలో గణతంత్ర వేడుకలు

ఏపీ సచివాలయంలో గణతంత్ర వేడుకలు

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, చీఫ్‌ సెక్యూరిటీ అధికారి కేకే మూర్తి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

అలాగే తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లం జాతీయ జెండాను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం ముఖ్య కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, సీఎం కార్యాలయ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డి, సీఎస్‌వోలు జోషి, పరమేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story