దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

దేశవ్యాప్తంగా కొత్త కలర్స్‌ కనిపిస్తున్నాయి. గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వేడుకలు మొదలయ్యాయి. పకడ్బందీ ఏర్పాట్లు చేేశారు. భారీ భద్రత కల్పించారు. రాజ్‌పథ్‌లో నిర్వహించే సైనిక పరేడ్‌కు భారీ ఏర్పాట్లు జరిగాయి. ఈసారి గణతంత్ర వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు జైరో బోల్సనారో ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాతీయ పతాకావిష్క రణ, సైనిక వందన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జయహో భారత్ అని నినదిస్తోంది. ఊరూవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. చాలా రాష్ట్రాల్లో.. గవర్నర్లు, ముఖ్యమంత్రులు మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు. వందనం సమర్పించారు. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో.. ఆ పార్టీ కొత్త అధ్యక్షుడు జేపీ నడ్డా పతాకావిష్కరణ చేశారు.

గణతంత్ర దినోత్సవం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఢిల్లీలోని రాజ్‌ఫథ్. అక్కడ జరిగే పరేడ్‌ను దేశమంతా తిలకిస్తుంది. సైనికుల కవాతు, జవాన్ల విన్యాసాలు, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే శకటాల ప్రదర్శన అదరహో అనిపిస్తాయి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇప్పటికి 7 దశాబ్దాలు పూర్తయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story