26 Jan 2020 11:09 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ఇవాళ టీడీఎల్పీ

ఇవాళ టీడీఎల్పీ సమావేశం

ఇవాళ టీడీఎల్పీ సమావేశం
X

మండలి రద్దుపై రేపు అసెంబ్లీలో ఏం జరుగుతుంది? సోమవారం అసెంబ్లీకి వెళ్లాలా వద్దా? అనే దానిపైనా టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది. ఉభయసభల్లో వ్యూహంపై చర్చించేందుకు ఇవాళ టీడీఎల్పీ సమావేశం కానుంది. పార్టీ MLCలు చేజారిపోకుండా చూసుకునే ప్రయత్నాల్లో భాగంగా.. MLCలతో సమన్వయం బాధ్యత యనమల, అచ్చెన్నాయుడుకి అప్పగించారు చంద్రబాబు. అటు, టీడీఎల్పీ సమావేశానికి రాలేకపోతున్నట్టు నలుగురు ఎమ్మెల్సీలు కేఈ ప్రభాకర్, సరస్వతి, తిప్పేస్వామి, శత్రుచర్ల సమాచారం ఇచ్చారు. మరోవైపు పార్టీ MLCలు అందరితో ఫోన్‌లో మాట్లాడుతున్న చంద్రబాబు.. పార్టీ పక్షాన నిలబడాలని, ధైర్యంగా పోరాడదామని MLCలకు పిలుపు ఇచ్చారు.

Next Story