డైరెక్టర్ పరిస్థితి విషమం..

బాలీవుడ్ ఇండస్ట్రీలో జగన్ శక్తి ఓ అగ్రదర్శకుడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉంది. గత ఏడాది అక్షయ్ కుమార్ హీరోగా మిషన్ మంగళ్ చిత్రాన్ని డైరక్ట్ చేశారు. ఇందులో విద్యాబాలన్, తాప్సీ, సోనాక్షి సిన్హా ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించి ఆయనకు ఎంతో పేరు తీసుకువచ్చింది. తాజాగా ఆయన తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటూ ఉండగా ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో ఫ్రెండ్స్‌తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ ఆయన్ని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆయన్ని పరీక్షించిన వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టడంతో కుప్పకూలినట్టు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. జగన్ శక్తి మిషన్ మంగళ్ కంటే ముందు చీని కమ్ చిత్రం చేశారు. పలు యాడ్స్‌కు దర్శకత్వం వహించారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com