చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్‌.. 80కి చేరిన మృతుల సంఖ్య

చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్‌.. 80కి చేరిన మృతుల సంఖ్య

చైనాను వణికిస్తున్నకరోనా వైరస్‌ ప్రపంచ దేశాలకు పాకింది. ఈ వైరస్‌తో ఇవ్పటి వరకు చైనాలో 80 మంది మృతి చెందగా.. మరో 2 వేల 744 మందికి సోకింది. రోగుల సంఖ్య అంతకంతకు పెరగడంతో ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటి వరకు 10 దేశాలకు పైగా ఈ కరోనా వైరస్‌ పాకినట్లు తెలుస్తోంది. థాయ్‌లాండ్‌, జపాన్‌, కొరియా, అమెరికా, వియత్నాం, సింగపూర్‌, మలేషియా, ప్రాన్స్, ఆస్ట్రేలియా, నేపాల్ దేశాల్లో వ్యాప్తి చెందింది.

మరో వైపు తెలంగాణలోనూ కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. చైనా, హాంగ్‌కాంగ్‌ దేశాల నుంచి వచ్చిన నలుగురినీ ఫీవర్‌ ఆసుపత్రిలో చేర్చుకొని, వేర్వేరు గదుల్లో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. వీరిలో ఒకరికి జలుబు, దగ్గు, జ్వర లక్షణాలు కనిపిస్తుండగా వారి నుంచి నమూనాలను సేకరించి ప్రత్యేక వాహనంలో పుణెకు పంపించారు. మీడియాలో కరోనా వైరస్‌ గురించి వస్తున్న కథానాలపై భయాందోళనకు గురవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story