ఢిల్లీలోని ఏపీ భవన్‌లో తొలగింపబడిన ఐ లవ్‌ అమరావతి

ఢిల్లీలోని ఏపీ భవన్‌లో తొలగింపబడిన ఐ లవ్‌ అమరావతి

ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఐ లవ్‌ అమరావతి బోర్డు తొలగించారు అక్కడి సిబ్బంది. రెసిడెంట్‌ కమిషనర్‌ ఆదేశం మేరకే తొలగించామని వారంటున్నారు. అయితే, బోర్డును కోతులు విరగ్గొట్టాయని, అందుకే తొలగించాల్సి వచ్చినట్లు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ భవన్‌లో ఐ లవ్‌ అమరావతి బోర్డు ఏర్పాటు చేశారు. బోర్డు ముందు సెల్ఫీలతో అంతా సందడి చేసేవారు. ఇప్పుడు బోర్డును తొలగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story